సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమైన టీడీపీ నేతలు ఇప్పటికే ఈ సభ కోసం అనంతపురానికి చేరుకున్నారు. సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనంతపురంలోని ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అలాగే, తదుపరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా చెప్పనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa