కర్ణాటక మైసూర్‌లోని BM హాబిటాట్ షాపింగ్ మాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ నాలుగో అంతస్తు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విరిగిపోయి ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ పైనుంచి కిందకు పడిపోయారు. పడిపోతున్న ఒకరిని కాపాడబోయి మరోవ్యక్తి కూడా జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని సునీల్ (27)గా, గాయపడిన వ్యక్తిని చంద్రుగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa