ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియాకప్‌ ఆరంభ మ్యాచ్‌లలో భారత్‌కు మెరుగైన రికార్డ్

sports |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 11:14 PM

ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లు పూర్తయ్యాయి. అయితే ఇందులో 14 సార్లు భారత్ టోర్నీలో ఆడిన తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. 1997లో మాత్రం శ్రీలంక చేతిలో తొలిసారి తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ తర్వాత వరుసగా 10 సార్లు విజయం సాధించింది.


ఇక చివరిసారి 2023లో ఆసియాకప్‌ జరిగింది. ఇందులో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.


గత 16 ఆసియాకప్‌లలో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేసిందంటే..


1984 ఆసియాకప్‌: శ్రీలంకపై గెలుపు


1988 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై విజయం


1991 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై గెలుపు


1995 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై విజయం


1997 ఆసియాకప్‌: శ్రీలంక చేతిలో ఓటమి


2000 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై గెలుపు


2004 ఆసియాకప్‌: యూఏఈపై విజయం


2008 ఆసియాకప్‌: హాంకాంగ్‌పై గెలుపు


2010 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై విజయం


2012 ఆసియాకప్‌: శ్రీలంకపై గెలుపు


2014 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై విజయం


2016 ఆసియాకప్‌: బంగ్లాదేశ్‌పై గెలుపు


2018 ఆసియాకప్‌: హాంకాంగ్‌పై విజయం


2022 ఆసియాకప్‌: పాకిస్థాన్‌పై గెలుపు


2023 ఆసియాకప్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫలితం రాలేదు (వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది)


ఇక ఆసియాకప్‌లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా భారత్ నిలిచింది. మొత్తంగా 16 ఎడిషన్లలో టీమిండియా 8 సార్లు టైటిల్ సాధించింది. ఆ తర్వాత శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరి ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారనేది తేలాల్సి ఉంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa