ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఈ సారి అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు మహిళలే ఉండనున్నారు. టోర్నీ చరిత్రలో తొలిసారి పూర్థిస్థాయిలో మహిళలతో ప్రపంచకప్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 2 వరకు ఐదు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గతంలో మహిళల టీ20 వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మహిళా అంపైర్లు, రిఫరీలను నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa