తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా (ఈవో) రెండోసారి అవకాశం లభించిన సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, తనపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. గత అనుభవాన్ని ఉపయోగించి మరింత సమర్థంగా సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పూర్వపు ఈవో శ్రీ శ్యామలరావు నుండి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికార బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం, శ్రీ సింఘాల్ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియోగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, తిరుమల క్షేత్రం విశ్వవ్యాప్తమైన పవిత్రత కలిగిన ప్రాంతమని, ఇక్కడ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తన ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటానన్నారు. భక్తుల అవసరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa