ఆర్థిక సంవత్సరం 2024–25కి సంబంధించిన ఆదాయపన్ను రిటర్నుల (ITR) ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 15తో ముగియనుంది. మొదట జులై 31గా నిర్ణయించిన గడువును CBDT ITR ఫారమ్‌లు, ఎక్సెల్ యుటిలిటీల అప్‌డేట్స్ కారణంగా పొడిగించింది. అయితే, ఇప్పుడు కూడా e-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు కొనసాగుతున్నాయని పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరోసారి పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa