ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోండా స్కూటీ, బైక్ ధరలు తగ్గింపు.. యాక్టివా, డియో, షైన్ ఎంత

business |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 10:54 PM

హోడా మోటార్ సైకిల్ అండా స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. తమ టూ-వీలర్స్‌ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 350 సీసీ వరకు బైకులు, స్కూటర్లపై వస్తు సేవల పన్ను జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన క్రమంలో ఈ మేరకు హోండా మోటార్ సైకిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మన దేశంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన స్కూటర్ హోండా యాక్టివా స్కూటీపై ఎంత మేర ధర తగ్గుతుంది? అనేది ఇప్పుడు మనం తలుసుకుందాం.


హోండా కంపెనీ జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో బైక్, స్కూటర్ మోడల్ బట్టి గరిష్ఠంగా రూ.18,887 వరకు ధర తగ్గించినట్లు తెలిపింది. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన స్కూటర్లలో హోండా కంపెనీకి చెందిన హోండా యాక్టివా, హోండా డియో సహా షైన్, యూనికార్న్, సీబీ350 సిరీస్ మోటార్ సైకిళ్ల ధరలు తగ్గించింది. ఈ క్రమంలో హోండా మోటార్ సైకిల్, స్కూటర్ సంస్థ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేశ్ మాథూర్ కీలక ప్రకటన చేశారు. ' భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణలను మేము స్వాగతిస్తున్నాం. ఈ వ్యూహాత్మక నిర్ణయం అనేది వ్యక్తిగత వాహనాల విక్రయాలను పెంచడమే కాదు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. సరైన సమయంలో టూ-వీలర్లు, విడి భాగాలపై జీఎస్టీని తగ్గించారు. దీంతో వాహనాలు మరింత తక్కువ ధరకే లభిస్తయి. ఇది మొత్తం టూవీలర్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది' అని పేర్కొన్నారు.


 ఈ ట్రాన్సాక్షన్లపై.. రూ. 20 వేలు దాటినా 100 శాతం పెనాల్టీ.. ఐటీ శాఖ వార్నింగ్!


వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అవి తప్పనిసరి.. బైక్‌ల నుంచి కార్ల వరకూ..


రక్షణ రంగంలోనే అతిపెద్ద డీల్.. 114 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు, భారత్‌లోనే తయారీ!


ఏ స్కూటర్, బైక్ పై ఎంత తగ్గుతుంది లిస్ట్ ఇదే


హోండా యాక్టివా 110 స్కూటర్ పై రూ.7874 వరకు తగ్గుతుంది.


డియో 110 స్కూటీపై రూ.7157 వరకు తగ్గుతుంది.


హోండా యాక్టివా 125 స్కూటీపై రూ.8259 వరకు తగ్గుతుంది.


డియో 125 స్కూటీపై రూ.8042 వరకు తగ్గుతుంది


హోండా షైన్ 100 బైక్ పై రూ.5672 తగ్గుతుంది.


షైన్ 100 డీఎక్స్ పైక్ పై రూ.6256 వరకు తగ్గుతుంది.


లివో 110 బైక్ పై రూ.7165 వరకు తగ్గుతుంది.


షైన్ 125 బైక్ ధర రూ.7443 వరకు దిగొస్తుంది.


ఎస్‌పీ 125 బైక్ ధర రూ.8447 వరకు తగ్గుతుంది.


సీబ125 హార్నెట్ బైక్ ధర రూ.9229 తగ్గుతుంది.


హోండా యూనికార్న్ బైక్ ధర రూ.9948 వరకు తగ్గుతుంది.


ఎస్‌పీ 160 బైక్ ధర రూ.10,635 తగ్గుతుంది.


హార్నెట్ 2.0 బైక్ ధర రూ.13026 వరకు తగ్గుతుంది.


ఎన్ఎక్స్ 200 బైక్ ధర రూ.13,978 వరకు తగ్గుతుంది.


సీబీ350 హార్నెస్ బైక్ ధర రూ.18,598 వరకు తగ్గుతుంది.


సీబీ350ఆర్ఎస్ బైక్ ధర రూ.18857 వరకు దిగొస్తుంది.


సీబీ350 బైక్ ధర రూ.18,887 వరకు తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa