మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు కావాలన్న జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని నాటకమాడారని చెప్పారు. ‘ఇలా చేస్తే ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు. సజ్జల ఆ పార్టీలో సీనియర్ నేత. ఆయన చెబితే వైసీపీ చెప్పినట్లే కదా’ అని నారాయణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa