విదేశాల్లో భారత సంతతి పౌరులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా యూకేలోని ఓల్డ్ బరీలో ఓ సిక్కు యువతిని ఇద్దరు స్థానికులు రోడ్డు పక్కనే అత్యాచారం చేశారు. 'మీ దేశానికి తిరిగి వెళ్లిపో' అంటూ దాడి చేశారని బాధితురాలు తెలిపారు. దీనిపై అక్కడి సిక్కు కమ్యూనిటీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనను జాత్యహంకార దాడిగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించింది. పోలీసులు నిందితుల ఆనవాళ్లు వెల్లడించి, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa