ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిత్యావసర వస్తువులన్నీ చౌక.... 99 శాతం ఆ శ్లాబులోకే

business |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 09:25 PM

వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ప్రతి భారతీయుడి ఘన విజయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పండగలు ఉంటాయని, అందుకు అనుగుణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశం మేరకు వచ్చే దీపావళి పండగకు ముందే జీఎస్టీ మార్పులను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నందున అప్పటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు తీసుకురావాలని నిర్ణయించామన్నారు. చైన్నాలో చెన్నై సిటిజెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగాల పలు విషయాలు వెల్లడించారు.


ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు వినియోగించే నిత్యావసరాలు జీఎస్టీ సంస్కరణలతో మరింత చౌకగా మారతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటి వరకు 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న 99 శాతం వస్తువులు, ఇతర ఉత్పత్తులు అన్నింటినీ 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా వాటి ధరలు తగ్గుతాయని, ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. గడిచిన 8 సంవత్సరాల్లో దేశంలో దాదాపు 1.5 కోట్ల వ్యాపారాలు జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని గుర్తు చేశారు. అంతకు ముందు 66 లక్షల వ్యాపారాలే పన్నుల వ్యవస్థలో ఉండేవని ఇప్పుడు అంది 1.5 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలతో పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేసినట్లు చెప్పారు.


జీఎస్టీ రేట్ల తగ్గింపుతో చాలా రకాల వస్తువుల ఉత్పత్తి వ్యాయాలు గణనీయంగా తగ్గుతాయని, దీని ఫలితంగా వాటి ధరలు మరింత చౌకగా మారతాయన్నారు కేంద్ర మంత్రి. గత 8 నెలల పాటు లోతైన అధ్యయనం చేసి ఈ మేరకు సంస్కరణలు చేశామన్నారు. 8 నెలల సుదీర్ఘ కసరత్తు విధానపరమైన మార్పులు చేసేందుకు ఎంతో దోహదం చేసిందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి కంటే దీపావళి కానుకను ప్రధాని మోదీ అందించారని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం పన్ను శ్లాబులను రెండుకు తగ్గించినట్లు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయమని కొనియాడారు.


జీఎస్టీ సంస్కరణలతో ప్రస్తుతం ఉన్న 12, 28 శ్లాబులను పూర్తిగా తొలగించి కేవలం 5, 18 శాతం శ్లాబులనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో చాలా వరకు నిత్యావసర వస్తువులు 5 శాతం శ్లాబులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 12 శాతంలో ఉన్న 99 వస్తువులు అందులో ఉన్నాయి. ఆ జాబితా ఓసారి చూద్దాం.


ఆహార ఉత్పత్తులు


వెన్న


నెయ్యి,


జున్ను


డెయిరీ ఉత్పత్తులు


ప్రీ ప్యాకేజ్డ్ సమ్కీన్లు


భుజియా


మిక్చర్లు


వంట సామగ్రి


వ్యవసాయ పరికరాలు


హస్త కళా వస్తువులు


చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులు


వైద్య పరికరాలు


డయాగ్నస్టిక్ కిట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa