జుట్టు ఒత్తుగా పెరగాలంటే ముందుగా రాలడం తగ్గాలి. దానికోసం మనం కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి డైట్ మెంటెయిన్ చేయడంతో పాటు స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. మంచి నిద్ర కూడా ముఖ్యమే. దీంతో పాటు హెయిర్ కేర్ అంటే జుట్టుకి ఆయిల్ రాయడం, చుండ్రు లేకుండా చూసుకోవడం, తలస్నానం చేయడం, ఇలా జుట్టుని మన బాడీని ఎలా మెంటెయిన్ చేస్తున్నామో అలా చేస్తేనే జుట్టు రాలడం తగ్గుతుంది. వీటన్నింటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా సమస్యని కంట్రోల్ చేస్తాయి. అందులో కొబ్బరిపాలు వాడడం. కొబ్బరినూనె మాత్రమే కాదు, కొబ్బరిపాలని జుట్టుకి ఎలా వాడాలో తెలుసుకోండి.
కొబ్బరి.. మన జుట్టుకి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రతీ ఒక్కరూ జుట్టుకి నూనె రాయడం అనగానే ముందుగా కొబ్బరినూనెని ఫస్ట్ చాయిస్‌గా చూస్ చేసుకుంటారు. వీటివల్ల జుట్టుకి పోషణ అందుతుంది. ఇందులోని పోషకాలు జుట్టుని మాయిశ్చర్ చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలానే కొబ్బరి పాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కొబ్బరిముక్కలని మిక్సీ పట్టి అందులో నీరు పోసి పిండి కొబ్బరిపాలని తయారు చేస్తారు. వీటిని వంటల్లో ఎక్కువగా వాడతారు. ఈ పాలని వాడడం వల్ల వంటల రుంచి అమాంతం పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అవి జుట్టుకి తేమని అందించి బలంగా చేస్తాయి.
కొబ్బరిపాలతో ప్రయోజనాలు
కొబ్బరి నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మం, గోళ్లని హెల్దీగా చేస్తాయి. కొబ్బరిలో ఎక్కువగా లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి జుట్టులోకి ఈజీగా చొచ్చుకుపోయి క్యూటికల్స్‌ని బలంగా చేస్తాయి.
అంతేకాకుండా ఇందులోని ప్రోటీన్ జుట్టుని బలంగా చేస్తాయి.
కొబ్బరిపాలు తాగడం వల్లే కాకుండా దీనిని జుట్టుకి అప్లై చేస్తే ఈ బెనిఫిట్స్‌ని పొందొచ్చు. కొబ్బరిపాలలో విటమిన్స్ సి, ఈ, బి1, బి3, బి5, బి6లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మీ బాడీకి అవసరం.
కొబ్బరిపాలలోని సూక్ష్మపోషకాలు జుట్టుని బలంగా, ఆరోగ్యంగా, మాయిశ్చరైజింగ్‌గా ఉంచుతాయి.
రాలడం తగ్గేందుకు
కొబ్బరిపాలలోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉన్నాయి. కాబట్టి, స్కాల్ప్ మాయిశ్చరైజ్ అవుతుంది. ఇందులోని నేచురల్ ప్రోటీన్స్ జుట్టుని కుదుళ్ళ నుంచి బలంగా చేసి వెంట్రుకల్ని బలంగా చేస్తాయి. దీంతో బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్‌ని తగ్గిస్తాయి.
డ్రై హెయిర్, డాండ్రాఫ్
కొబ్బరిపాలలోని సహజ ఫ్యాటీ యాసిడ్స్ మాయిశ్చరైజింగ్ ప్రభావాలని కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. తలపై చర్మాన్ని రిపేర్ చేసి కండీషనర్‌గా పనిచేస్తాయి. కొబ్బరిపాలు జుట్టు, తలపై చర్మాన్ని కండీషన్ చేస్తాయి. దీంతో జుట్టుని బలంగా చేస్తాయి. డ్రైగా కాకుండా చేస్తాయి. ఈ కారణంగా జుట్టు షైనీగా అందంగా ఉంటుంది.
మసాజ్
తాజా కొబ్బరిపాలని తీసుకుని నేరుగా స్కాల్ప్‌కి రాయాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ పెరిగి జుట్టు పెరుగుతుంది.
ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాలు వదిలేయాలి.
కావాలనుకుంటే మీరు రోజ్‌మెరీ, ఆముదంతో కలపి కూడా రాయొచ్చు.
మీది మరీ డ్రై హెయిర్ అయితే కండీషనింగ్ మాస్క్‌లో కొబ్బరిపాలు కలిపి ప్యాక్ వేయొచ్చు.
30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.
బెనిఫిట్స్
రెగ్యులర్‌గా ఇలా చేస్తే జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా మారతుంది. ఒత్తుగా కూడా పెరుగుతుంది.
అయితే, వాడే ముందు స్టోర్‌లో కొన్నది కాకుండా తాజాది వాడేలా చూసుకోండి. ఎందుకంటే స్టోర్‌లో కొన్ని కొబ్బరిపాలలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa