బెట్టింగ్ యాప్ ‘1xBet’కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు.. తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ప్రముఖ నటుడు సోనూ సూద్‌లకు సమన్లు జారీ చేశారు. ఈ నెలలోనే వారిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 22న రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూ సూద్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేసినందుకు గాను వారి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలపై అధికారులు ఆరా తీయనున్నారు. కాగా, ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రా, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి మంగళవారం తమ పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa