అంతా ఆహారంలోనే ఉంటుంది. మీరేం తింటున్నారనే దాన్ని బట్టి మీ చర్మం ఎలా ఉంటుంది. మీకు ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి. మీరెంత ఆరోగ్యంగా ఉంటారు అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే..డాక్టర్లు ఎవరైనా సరే ముందుగా ఆహారపు అలవాట్ల గురించి అడిగి తెలుకున్నాకే మిగతా డయాగ్నసిస్ చేస్తారు. ఫుడ్ అంత ముఖ్యం మరి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..కొంతమంది ముప్పై ఏళ్లకే ముసలివాళ్లలా కనిపిస్తున్నారు.
జుట్టంతా రాలిపోయి..ముఖం పాలిపోయి ముడతలు పడి ఉంటోంది. ఇందుకు ముఖ్యమైన కారణం..జుట్టుకు, చర్మానికి సరిపడా న్యూట్రియెంట్స్ అందకపోవడం. ఎప్పుడైతే సరైన పోషకాలు అందవో అవి అప్పటి నుంచే సహజత్వాన్ని కోల్పోతాయి. ఫలితంగా చాలా డల్ గా మారిపోతాయి. అయితే..ఓ ఆయుర్వేద ఎక్స్ పర్ట్ చెప్పినట్టుగా కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.
కొలాజీన్ ముఖ్యం
మీ చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, మీరు యంగ్ గా కనిపించాలన్నా కొలాజీన్ అనే ప్రొటీన్ చాలా కీలకం. వయసు పెరిగే కొద్ది ఇది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే..అలా ముఖం పాలిపోయినట్టుగా తయారవుతుంది. అయితే..చర్మం ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉండాలంటే మాత్రం ఈ ప్రొటీన్ ని పెంచుకోవాలి. చర్మ కణాల స్ట్రక్చర్ ని సరైన విధంగా ఉంచాలంటే ఇది చాలా అవసరం.
వయసు పెరిగే కొద్దీ కొలాజీన్ ఉత్పత్తి తగ్గిపోతూ వస్తుంది. దీని వల్ల కళ్ల కింద ముడతలు పడతాయి. చర్మం వేలాడుతున్నట్టుగా అవుతుంది. ఫలితంగా చాలా త్వరగా ముఖంలో ముసలితనం ఛాయలు కనబడతాయి. అదే సమయంలో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. చర్మం పొడిగా మారిపోతుంది. ఫలితంగా మచ్చలు వస్తాయి. ఇలా ఒకటి తరవాత మరో సమస్య వచ్చి పడుతుంది. వీటన్నింటినీ తగ్గించుకోడానికి రకరకాల మందులు, క్రీమ్స్ వాడాల్సి వస్తుంది.
ఎక్స్ పర్ట్ ఏం చెప్పారు
ఇప్పుడు చెప్పినట్టుగా క్రీమ్స్, మెడిసిన్స్ వాడడం ద్వారా చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. చర్మ కణాలు యాక్టివ్ గా ఉంటాయి. అయితే..ఇది తాత్కాలికమే. చర్మం సహజంగా కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలో ఛండీగఢ్ కి చెందిన ఆయుర్వేద ఎక్స్ పర్ట్ డాక్టర్ మోనిక వివరించారు. ఆయుర్వేద చిట్కాల ద్వారా కళ కోల్పోయిన ముఖానికి మళ్లీ అందం తీసుకురావచ్చని చెప్పారు.
ఎక్కువ రోజుల పాటు అందంగా ఉండాలన్నా, చర్మం ముడతలు పడకుండా సరైన విధంగా ఉండాలన్నా కొలాజీన్ అవసరం. అందుకే..కొలాజీన్ ఉత్పత్తి కోసం కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలని సూచించారు డాక్టర్ మోనికా. అందులో ఉసిరికాయ, పసుపు, నెయ్యితో పాటు మరి కొన్ని పదార్థాలున్నాయి. మరి ఇవి కొలాజీన్ ఉత్పత్తిలో ఎలా సహకరిస్తాయి. అసలు..చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ఎలా తోడ్పడతాయో తెలుసుకుందాం.
ఉసిరికాయ
ఉసిరికాయలో ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చర్మంలోని మురికి అంతా బయటకు వెళ్లిపోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఉసిరి ద్వారా అందించవచ్చు. పైగా ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..ఉసిరి కాయలో కొలాజీన్ ప్రొటీన్ ఉంటుంది. రెగ్యులర్ గా తినడం వల్ల కొలాజీన్ ఉత్పత్తి అవుతుంది. ఉసిరిని కొలాజిన్ పవర్ హౌజ్ గా పిలుస్తుంటారు.
రోజూ ఓ ఉసిరి కాయ తినడం వల్ల చర్మ కణాలు దృఢంగా మారిపోతాయి. అదే సమయంలో చర్మంపై ముడతలు, కళ్ల కింద వలయాలు రాకుండా ఉంటాయని డాక్టర్ మోనికా వివరించారు. ఉసిరిని రసం రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలు అందుతాయి. రోజువారీ డైట్ లో ఉసిరిని తప్పకుండా చేర్చుకుంటే ఎక్కువ రోజుల పాటు యంగ్ గా కనిపించేందుకు అవకాశముంటుంది.
సీడ్స్, నట్స్
ఇక సీడ్స్, నట్స్ లో ఎన్ని పోషకాలుంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ లో జింక్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొలాజిన్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా చర్మం ఎప్పటికీ కాంతివంతంగా ఉంటుంది. ఇక వీటిలో ఉండే జింక్ కొలాజిన్ లో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ లను సరైన విధంగా ఉంచుతాయి.
అంటే..ఎక్కువ కాలం పాటు కొలాజిన్ నిలిచి ఉంచేలా చూస్తాయి. నువ్వుల లడ్డులు ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు. తెలియకుండానే వీటి ద్వారా జింక్, ఐరన్ అందుతుంది. అయితే..నువ్వుల నూనెతో ముఖంపై మసాజ్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుందని డాక్టర్ మోనికా వివరించారు. వీటితో పాటు పసుపు, అశ్వగంధ, పాలు, నెయ్యి లాంటివి కూడా డైట్ లో యాడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. మరి వీటి ద్వారా ఎలాంటి లాభాలుంటాయో చూద్దాం.
పసుపు, నెయ్యి
పసుపులో కర్ క్యుమిన్ ఉంటుంది. ఇది ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అదే సమయంలో కొలాజీన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోయిందంటే..చర్మం ఆరోగ్యవంతంగా మారుతుందని అర్థం. వేడి పాలల్లో పసుపు వేసుకుని రాత్రి నిద్రపోయే ముందు తాగితే చాలా మంచిది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కొలాజిన్ ఉత్పత్తికి కూడా ఇది సాయపడుతుంది. అందుకే..వేడి పాలల్లో పసుపుతో పాటు నెయ్యి కూడా కలిపి తాగితే ఇంకాస్త వేగంగా కొలాజిన్ ఉత్పిత్తి అయ్యేందుకు అవకాశముంటుంది. పాలకూర, మునగాకు లాంటి వాటినీ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ మోనికా. అశ్వగంధ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa