బాలీవుడ్ నటి దిశా పటానీ నివాసం వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను పట్టుకోడానికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రయత్నించగా.. వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన ఇద్దరు నిందితులు మృతిచెందారు. గాయపడిన ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులకు కరుడగట్టిన నేరస్థుల ముఠాతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సెప్టెంబరు 12న యూపీలోని బరేలీ సివిల్ లైన్ ప్రాంతంలో ఉన్న దిశా పటానీ నివాసం వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఆ రోజు తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల జరిపిన సమయంలో దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డీఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ, ఆమె అక్క ఖుష్బూ పటానీలు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గోల్డీ బ్రార్ ముఠా సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.
ఈ అంశంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను దిశా కుటుంబం కలిసింది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించే క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa