ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Air India Plane Crash: "నా కుమారుడి గౌరవం దెబ్బతింది" – పైలట్ తండ్రి ఆవేదన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 08:47 PM

ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, విమానాశ్రయం విడిచిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.బోయింగ్ 787-8 మోడల్‌కు చెందిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్తో పాటు 241 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ఘటనపై తాజాగా, కెప్టెన్ సబరాల్వ్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్, తిరిగి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. 91 ఏళ్ల పుష్కరాజ్, మాజీ ప్రభుత్వ అధికారి. ఆయన ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సెక్రటరీతో పాటు ఏఎఐబీ (ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) డైరెక్టర్ జనరల్‌కి లేఖ రాశారు.ఆ లేఖలో, “ఎయిర్ క్రాఫ్ట్ (ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్) రూల్స్ – 2017”లోని రూల్ 12 ప్రకారం, ఈ ఘటనపై లాంఛనపూర్వక దర్యాప్తు (Formal Inquiry) జరపాలని కోరారు.ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు పాక్షికంగా, సెలెక్టివ్ లీకులు మరియు ఊహాగానాల ఆధారంగా సాగుతోందని, ఇది తన కుమారుడి గౌరవానికి (మరణానంతరం) తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు.ఈ లీకులు సుమీత్ మానసిక స్థితిపై అసత్య కథనాలకు దారితీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆగస్టు 29న రాసిన లేఖలో, "ఈ పరిణామాలు నా ఆరోగ్యంపైనే కాదు, నా కుమారుడి స్మృతిపైనా చెడు ప్రభావం చూపుతున్నాయి" అని పుష్కరాజ్ పేర్కొన్నారు.అలాగే, "మానసిక ఒత్తిడి, భార్యతో విడాకులు, తల్లి మరణం వంటివి అతను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని" వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.“సభర్వాల్ 15 ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు. అతని తల్లి మృతి చెందినా, అప్పటినుంచి మూడేళ్లు దాటిపోయాయి. ఆ తర్వాత కూడా ఎలాంటి లోపాలు లేకుండా 100కి పైగా విమానాలు నడిపాడు” అని పుష్కరాజ్ సభర్వాల్ లేఖలో స్పష్టం చేశారు.ఇక, ఏఏఐబీ జూలై 12న విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో– ప్రమాదానికి స్పష్టమైన కారణాన్ని తేల్చలేమని పేర్కొన్నారు. ఫలితంగా, పైలట్ మానవ తప్పిదం లేదా మానసిక స్థిరత కోల్పోవడమే కారణమన్న ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa