కిడ్నీలు మన బాడీలో పిడికిలి పరిమాణంలో బీన్ ఆకారంలో ఉండే అవయవాలు. పక్కటెముకల కింద, వీపువైపు ఉంటాయి. సాధారణంగా రెండు కిడ్నీలు పనిచేస్తాయి. కానీ, కొన్నిసార్లు ఓ కిడ్నీ ఫెయిల్ అయితే మరో కిడ్నీతో లైఫ్ లీడ్ చేస్తారు. కిడ్నీలు మన బాడీలోని ట్యాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేసి బాడీ నుండి వ్యర్థాలను మూత్రం ద్వారా పంపుతాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే బాడీలో ట్యాక్సిన్స్ పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది తీవ్రమై మరణానికే దారితీస్తుంది. అయితే, సరైన సమయంలో సమస్యని గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవచ్చు. నిజానికి ప్రతీ ఏడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కొన్నిసార్లు స్పీడ్‌గా జరుగుతుంది. రోజులు గడిచేకొద్దీ ఇది తీవ్రమైన దశకి చేరుకుంటుంది. దీనినే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటారు. దీనిని ఎలా చెప్పొచ్చు అంటే మీరు ట్రీట్‌మెంట్ చేసుకోకుండా కొన్నిరోజులు, వారాల వరకూ ప్రాణాలతో ఉంటారు. అయితే, కిడ్నీలు ఫెయిల్ అయ్యే ముందు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగా గుర్తించాలి. దీంతో కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవ్వకుండా చూసుకోవచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ దశలు
కిడ్నీ ఫెయిల్యూర్‌ని కొన్ని దశలుగా విభజించారు. కిడ్నీలు పదార్థాలను ఫిల్టర్ చేసే పద్ధతిని బట్టి ఇలా దశల వారిగా విభజించారు.
స్టేజ్ 1లో గ్లోమెరులర్ వడపోత రేట్(జీఎఫ్ఆర్) 90 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజీలో కిడ్నీలు కొద్దిగా నష్టాన్ని కలిగి ఉన్నప్పటికీ సాధారణంగా పనిచేస్తాయి.
స్టేజ్ 2 లో గ్లోమెరులర్ వడపోత రేట్(జీఎఫ్ఆర్) 60 కంటే తక్కువగా లేదా 89 వరకు ఉండొచ్చు. ఇందులో స్టేజ్ 1 కంటే ఎక్కువ నష్టం ఉన్నప్పటికీ, కిడ్నీలు బాగానే పనిచేస్తాయి.
స్టేజ్ 3 : గ్లోమెరులర్ వడపోత రేట్(జీఎఫ్ఆర్) ఇందులో 30 కంటే తక్కువగా లేదా 59 వరకూ ఉంటుంది. కిడ్నీల పనితీరు స్వల్పంగా, తీవ్రంగా కోల్పోయి సరిగ్గా పనిచేయవు.
స్టేజ్ 4 : గ్లోమెరులర్ వడపోత రేట్(జీఎఫ్ఆర్15 కంటే తక్కువగా లేదా 29 వరకూ ఉంటుంది. ఈ స్టేజ్‌లో కిడ్నీల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది.
స్టేజ్ 5 : గ్లోమెరులర్ వడపోత రేట్(జీఎఫ్ఆర్) 15 కంటే తక్కువగా ఉంటుంది. ఈ స్టేజీలో కిడ్నీలు పూర్తిగా పనిచేయవు. లక్షణాలు ఈ టైమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అవి అందరికీ ఒకేలా ఉండవవు. మనిషి మనిషికి వేర్వేరుగా ఉంటాయి.
శ్వాస సమస్యలు, ఏకాగ్రత తగ్గడం, వాపు
బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శ్వాస తీసుకోవడం, వదలడం కష్టంగా ఉంటుంది. చిన్నదానికే ఆయాసం వచ్చినట్లుగా ఉంటుంది. చర్మం కూడా డ్రైగా మారుతుంది. ఆకలి ఉండదు. ఫుడ్ తిన్నా కూడా అదో రకమైన మెటాలిక్ టేస్ట్ ఉంటుంది.ఏ పనిపై శ్రద్ధ ఉండదు. అదో గందరగోళంగా ఉంటుంది. పనులు చేసుకోలేరు. కిడ్నీలు సోడియం, నీటిని బయటికి సరిగ్గా పంపలేవు. దీంతోనే పాదాలు, ముఖ్యంగా చేతుల, చీలమండలు, ముఖంలో వాపు వంటివి వస్తాయి. బాడీ స్వెల్లింగ్ ఉంటుంది. తిమ్మిర్లు వస్తుంటాయి. కండరాల నొప్పులు ఉంటాయి.
అలసట, వాంతులు, వికారం
ఏ పని చేయకపోయినా ఊరికే అలసిపోవడం, నీరసంగా మారడం, ప్రతీ చిన్న పనిచేయగానే అలసట రావడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఇది ఇతర సమస్యల కారణంగా కూడా జరుగుతుంది. కానీ, అలసట, నీరసం ఉంటే ముందుగా గుర్తించాలి. దీంతోపాటు, వికారం, వాంతులు కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఓ లక్షణం. ఊరికే వికారంగా అనిపించడం, వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. కిడ్నీలు ట్యాక్సిన్స్ తొలగించేలనప్పుడు పేరుకుపోయి ఇలా వాంతులు, వికారంగా అనిపిస్తుంది. అలసటతో పాటు ఈ లక్షణం ఉంటే త్వరగా గుర్తించాలి. బాడీలో ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ లోపం ఏర్పడుతుంది. దీని వ్లల ఎర్ర రక్తకణాలు తగ్గి అలసట ఏర్పడుతుంది
మూత్రంలో మార్పు
ఎక్కువసార్లు మూత్రం పోయే వారు ఇప్పుడు అలా వెళ్లరు. మూత్ర సమస్యలొస్తాయి. వెళ్లినా కూడా చుక్కల్లా వస్తుంది. మూత్రం నురుగ్గా వచ్చినా, రక్తం కనిపించినా కిడ్నీల పనితీరు తగ్గిందని సూచన. కొంతమందికి మూత్ర విసర్జన పెరిగితే, మరికొంతమందికి తగ్గుతుంది. ఇలా మూత్రంలో ఏ మాత్రం తేడా కనిపించినా ముందుగా గుర్తించాలి. దీంతో పాటు చర్మం డ్రైగా మారుతుంది. స్కిన్‌పై ఊరికూరికే దురద వస్తుంది. ఈ లక్షణం కనిపించినా కూడా ముందుగానే అలర్ట్ అవ్వాలి. ఈ లక్షణాలు కనిపించానే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే డాక్టర్‌ని కలవాలి. వారిచేత సమస్య చెక్ చేసుకుని తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
కారణాలు
కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అవి.
షుగర్, హైబీపి వంటివి కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కారణమవుతుంది.
షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయకపోతే నిరంతర అధిక రక్త చక్కెర కిడ్నీలతో పాటు ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది.
హైబీపి ఉంటే రక్తం మీ శరీర రక్తనాళాల ద్వారా స్పీడ్‌గా ప్రయాణిస్తుంది. దీనికి ట్రీట్‌మెంట్ లేకపోతే మూత్రపిండాల కణజాలాన్ని దెబ్బతీస్తుంది.
కిడ్నీ ఫెయిల్యూర్ గురించి డాక్టర్
ఇతర కరాణాలు
పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది మీ పేరెంట్స్ నుండి వారసత్వంగా వచ్చే సమస్య. ఇది కిడ్నీల లోపల ద్రవంతో నిండిన సంచులు పెరగడానికి కారణమవుతుంది.
గ్లోమెరులర్ డిసీజెస్ : ఈ వ్యాధులు కిడ్నీల పనితీరుని ఎఫెక్ట్ చేస్తాయి. ఆటో ఇమ్యూన్ కిడ్నీ ప్రాబ్లమ్స్లూపస్ అనేది ఓ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది అవయవ నష్టం. కీళ్ల నొప్పి, జ్వరం, చర్మ దద్దుర్లకి కారణమవుతుంది. కొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూలర్ అనేది కొన్ని గంటలు, రోజుల్లోనే పెరుగుతుంది. వీటితో పాటుకొన్ని రకాల మెడిసిన్స్నీరు తాగకపోవడంమూత్రవవాహికలో సమస్యలుగుండె సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్‌మెంట్ చేయకపోవడం కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa