విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిరిండియా యాజమాన్యం ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa