నథింగ్ (Nothing) కంపెనీ తమ తాజా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, నథింగ్ ఎర్ 3 (Nothing Ear 3) ను కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ చేసింది.ఈ కొత్త మోడల్‌లో చార్జింగ్ కేస్ ప్రత్యేకమైన "సూపర్ మైక్" ఫీచర్‌తో వస్తోంది, ఇది 95dB వరకు శబ్దాన్ని తగ్గించి, స్పష్టమైన వాయిస్ కాల్స్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫీచర్‌ను మీరు కేస్‌పై ఉన్న ‘టాక్’ బటన్ ద్వారా తక్షణమే యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా, ఈ ఇయర్‌బడ్స్‌తో మీరు చార్జింగ్ కేస్ నుండి నేరుగా వాయిస్ నోట్స్ కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ వాయిస్ నోట్స్, నథింగ్ ఓఎస్ ఫోన్లలో ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్షన్ అవుతాయి.నథింగ్ ఎర్ 3 లో 45dB వరకూ రియల్ టైమ్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా ఉంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 38 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఈ డివైస్ అందిస్తుంది అని కంపెనీ తెలిపింది.
*నథింగ్ ఎర్ 3 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు:
*వాయిస్ & మైక్రోఫోన్:ప్రతి ఇయర్‌బడ్లో మూడు మైక్రోఫోన్లు మరియు ఒక బోన్ కండక్షన్ వాయిస్ పికప్ యూనిట్ ఉంది. AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ గాలి శబ్దాలను 25dB వరకు తగ్గిస్తుంది.
*నాయిస్ క్యాన్సిలేషన్:45dB వరకు శబ్దాన్ని నిరోధించే రియల్-టైమ్ అడాప్టివ్ ANC ప్రతి 600 మిల్లీసెకన్లకు పర్యావరణాన్ని అనుసరించి సర్దుబాటు అవుతుంది.
*ఆడియో:12mm డైనమిక్ డ్రైవర్స్‌తో బాస్, ట్రెబుల్ ను 4-6dB వరకు మెరుగుపరచబడ్డాయి.
*కనెక్టివిటీ:బ్లూటూత్ 5.4 తో LDAC హై-రెజల్యూషన్ ఆడియో సపోర్ట్, గేమింగ్ మరియు వీడియోల కోసం 120ms కన్నా తక్కువ లేటెన్సీ అందిస్తుంది.
*బ్యాటరీ:ప్రతి ఇయర్‌బడ్ 55mAh బ్యాటరీతో ఉంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి 38 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల వినోదం అందుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మద్దతు ఇస్తుంది.
*డిజైన్:పారదర్శకమైన కేసింగ్, మెటల్ యాక్సెంట్స్ ప్రత్యేకత. చార్జింగ్ కేస్ 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడింది. ఇయర్‌బడ్స్ మరియు కేస్ రెండు IP54 రేటింగ్ కలిగి ఉంటాయి, అంటే ధూళి, నీటి నిరోధకత ఉన్నవిగా ఉంటాయి.
*ధర మరియు విడుదల:నథింగ్ ఎర్ 3 ధర యూరోపియన్ మార్కెట్లలో EUR 179 (సుమారు రూ. 18,700), బ్రిటన్‌లో GBP 179 (సుమారు రూ. 21,500), అమెరికాలో $179 (సుమారు రూ. 16,000) గా నిర్ణయించారు. ఇది బ్లాక్, వైట్ రెండు రంగులలో లభిస్తుంది. సెప్టెంబర్ 18 నుండి నథింగ్ అధికారిక వెబ్‌సైట్ మరియు ఎంచుకున్న స్టోర్స్‌లో ప్రీ-ఆర్డర్‌లు మొదలయ్యాయి. సెప్టెంబర్ 25 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ టీడబ్ల్యూఎస్ హెడ్‌ఫోన్లు త్వరలో భారత మార్కెట్లో కూడా విడుదల కానున్నాయి. అయితే, భారతదేశ ధర మరియు విడుదల తేదీపై ఇంకా కంపెనీ అధికారిక ప్రకటన లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa