ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నం (46.23 కి.మీ) మరియు విజయవాడ (38 కి.మీ) మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్లలో గరిష్ఠంగా 3 కంపెనీల జాయింట్ వెంచర్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ పనులకు సంబంధించిన 40 శాతం సివిల్ వర్కులకు టెండర్లు పిలిచారు. విశాఖపట్నం ప్రాజెక్టుకు అక్టోబర్ 10 లోగా, విజయవాడ ప్రాజెక్టుకు అక్టోబర్ 14 లోగా టెండర్లు దాఖలు చేయాలి. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa