కొన్నిసార్లు పాదాలు మంటలు పుడతాయి. మరికొన్నిసార్లు చల్లగా మారి ఐస్గడ్డల్లా ఉంటాయి. మరోసారి తిమ్మిర్ళు ఉంటాయి. ఏ సీజన్ అయినా కొంతమంది పాదాలు పగులుతూనే ఉంటాయి. ఇలా పాదాల ఎప్పుడు ఒకేలా ఉండవు. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు అనుకుంటే పొరబాటే. కొన్నిసార్లు మన పాదాలు మనకి ఉండే సమస్యల గురించి, మన బాడీలోని విటమిన్ల లోపం గురించి చెబుతాయి. ఇదే విషయం గురించి డాక్టర్ ఆడ్రియాన్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. దాన్ని బట్టి పాదాల పగుళ్ళు ఉన్నా, చల్లబడ్డా, వాపు వచ్చినా వాటిని నెగ్లెక్ట్ చేయొద్దొని బాడీలో వచ్చే కొన్ని సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందని చబుతున్నారు. ఏ లోపం ఉంటే పాదాలు చల్లబడతాయి, పాదాలు పగులుతున్నాయంటే మరే సమస్య ఉంది, షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి పాదాలని చూసి చెప్పొచ్చా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోండి.
పాదాలు చల్లబడడం
చలికాలంలో, వర్షాకాలంలో పాదాలు చల్లగా ఉండడం సహజమే.దీనికి కారణం మనం నేలపై నడవడం, తడిగా ఉండే వాతావరణంలో ఉండడం. కానీ, కొంతమందికి ఏ కాలమైనా పాదాలు చల్లగా ఉంటాయి. ముట్టుకుంటేనే చలి పుట్టేలా ఉంటాయి. దీనికి కారణం బాడీలో అయోడిన్ తగ్గడం లేదా ఐరన్ లోపం కారణమై ఉండొచ్చొని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఈ రెండింటి కారణాల వల్ల పాదాలు చల్లగా మారతాయని, కొన్నిసార్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోయినా థైరాయిడ్ గ్రంధులు సరిగ్గా పనిచేయకపోయినా, షుగర్ ఉన్నా, రేనాడ్స్ సిండ్రోమ్ కారణంగానైనా పాదాలు చల్లగా ఉంటాయి. అయితే, దీని గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా మనం బాడీ చెకప్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
కాళ్ళ తిమ్మిర్లు
కొంతమందికి ఊరికే కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి. మొత్తం పాదాలు, కాళ్లలో చీమల పాకినట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం మెగ్నీషియం లోపం అయి ఉండొచ్చు. ఈ సమస్య ఉంటే కండరాలు నొప్పులుగా అనిపించడం, గుండెకొట్టుకోవడంలో మార్పులు, అలసట, వికారం ఇతర సమస్యలు ఉంటాయి. ఇలాంటివన్నింటిని గుర్తించి ముందుగా చెక్ చేసుకోవడం మంచిది. తక్కువ పొటాషియం, కాల్షియం ఉన్నా ఇదే సమస్యలు ఉంటాయి. దీంతో పాటు నీరు సరిగ్గా తాగకపోవడం ఉంటే తిమ్మిర్లు ఎక్కువగా అవుతాయి. నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. ఈ కారణంగా పాదాల తిమ్మిర్లు ఉంటాయి. వీటితో పాటు మూత్రవిసర్జన కోసం ట్యాబ్లెట్స్ వేసుకోవడం, స్టాటిన్స్ ట్యాబ్లెట్స్ వాడినా కూడా కాళ్ళు తిమ్మిర్లు పడుతుంటాయి.
పాదాలు జలదరింపు, తిమ్మిర్లు
పాదాలు ఒక్కసారిగా జలదరించినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు ఉంటే విటమిన్ బి 12 లోపం కారణంగా సమస్య వస్తుందేమోనని గ్రహించాలి. నాడీ వ్యవస్థ, ఎర్ర రక్తకణాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ తగినంతగా లేకపోయినా సమస్య వస్తుంది. ఈ సమయంలో అలసట, కండరాల బలహీనత, మతిమరుపు, నోటిలో పుండ్లు ఉంటాయి. విటమిన్ బి12 లోపం కారణంగా రక్తహీనత ఏర్పడి నరాల సమస్యలు వస్తాయి. ఈ కారణంగా జలదరింపు, తిమ్మిర్లు వస్తుంటాయి. అయితే, షుగర్, సయాటికా, హైపో థైరాయిడిజం, ఆల్కహాల్ సంబంధిత న్యూరోపతి కారణాల వల్ల కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, మీకు ఏ సమస్యలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. షుగర్ వంటి సమస్యల్ని ముందుగానే కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది.
పాదాల పగుళ్ళు
విటమిన్ బి 3, ఐరన్, జింక్ లోపం కారణంగా పాదాలు పగులుతుంటాయి. కానీ, చాలా మంది పాదాలు పగలగానే కేవలం చర్మ సమస్యలా ట్రీట్ చేస్తారు. క్రీమ్స్, లోషన్స్ వంటివి రాస్తారు. కానీ, ఇది కూడా బాడీలో ఉన్న లోపం కారణంగానే జరుగుతుందని గ్రహించాలి. కొంతమందికి పొడి చర్మం ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్య ఉన్నా, ఎక్కువసేపు నిలబడినా, సరిగ్గా సరిపోని ఫుట్వేర్ వేసుకున్నా సమస్య వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాదాలు అదే పనిగా పగులుతున్నాయంటే ముందుగా ఏ లోపమైనా ఉందా, మరే ఇతర కారణమా తెలుసుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా క్రీమ్స్ రాస్తే సమస్య తగ్గుతుంది.
పాదాలని బట్టి ఆరోగ్యం
పాదాల వాపు
కొంతమందికి పాదాలు వాపు ఉంటుంది. అలాంటప్పుడు కిడ్నీ సమస్యలు ఉన్నా, గుండె సమస్యలున్నా ఇలానే జరగుతుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఆడవారిలో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఇవే కాకుండా సిరల లోపం, లివర్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల మందులు కాల్షియం ఛానల్ బ్లాకర్స్, స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే పాదాలు వాస్తుంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.
వెరికోస్ వీన్స్
వెరికోస్ వీన్స్ ఉంటే పిక్కల్లోని నరాలు రంగు మారినట్లుగా కనిపిస్తాయి. ఎక్కువగా నిలబడినా, ప్రెగ్నెన్సీ ఉన్నా, అధిక బరువు ఉన్నా కూడా వెరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. దీనికి కారణంసిర కవాటాలు దెబ్బతినడం, బలహీనమైతే ఈ సమస్య వస్తుంది. కాబట్టి, ముందునుంచీ ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa