నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 24 (బుధవారం) నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 నీటి ప్రాజెక్టులో లీకేజీలు వెలుగులోకి రావడంతో వాటిని మరమ్మతు చేయడం జరుగుతోంది.కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న pumping main లో పెద్ద లీకేజీలు గుర్తించబడినట్లు HMWSSB తెలిపింది. ఈ కారణంగా 24 గంటల పాటు మరమ్మతులు జరగనున్నాయి. అందువల్ల, కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWSSB హెచ్చరించింది.
*నీటి సరఫరా ఆగే ప్రాంతాలు:ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, బల్క్ వాటర్ కనెక్షన్లు, ఆఫ్ టేక్ పాయింట్లు, ఎర్రగడ్డ, SR నగర్, అమీర్‌పేట్, KPHB కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్.HMWSSB సూచన ప్రకారం, ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa