రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో పీఆర్ ఇవ్వడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. విదేశీ వైద్య విద్య చదివిన విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధానంగా ఆంధ్రప్రదేశ్ పాలన అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో పాటు డాక్టర్స్ డే రోజున జూనియర్ డాక్టర్స్ ని అరెస్ట్ చేశారు. వైయస్ జగన్ 17 మెడికల్ కాలేజ్ లు తీసుకొని వస్తే..వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్య విద్యా కోసం విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ఉపయోగ పడతాయి. ఆంధ్రప్రదేశ్ పీఆర్ ఇవ్వకపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు ఇంటర్ షిప్ కు పోతున్నారు` అని కల్పలతారెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa