విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా ఈ పవిత్ర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామ కృష్ణంరాజుకు లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అన్నపూర్ణా దేవి అలంకరణలో అమ్మవారిని చూడటం తన అదృష్టమని, విజయవాడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమ్మవారు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రఘురామ తెలిపారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ రాష్ట్రంలో ఉత్సాహాన్ని నింపాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు ఉపరాష్ట్రపతి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa