రాష్ట్రహోదా కోరుతూ లడఖ్‌లో బుధవారం ఉదయం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు.. పోలీస్ వాహనానికి కూడా నిప్పంటించారు. లడఖ్‌లో రాష్ట్రహోదా కోసం చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగడం ఇదే మొదటిసారి. వందలాదిగా లేహ్ సిటీ వీధుల్లోకి వచ్చిన ప్రజలు.. రాష్ట్రహోదా, రాజ్యాంగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుపై నిరాహార దీక్ష చేపట్టిన లడఖ్ వాసులు.. బుధవారం పూర్తిస్థాయి బంద్‌కు పిలుపునిచ్చారు. లేహ్‌లోని బీజేపీ కార్యాలయంపై దాడిచేసిన నిరసనకారులు.. పోలీసులపై రాళ్లు రువ్వి, వారి వాహనాన్ని తగులబెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.
ఇటీవల కాలంలో లడఖ్‌లో ఇటువంటి ఘర్షణలు జరగడం ఇదే మొదటిసారి. త్వరలో ప్రభుత్వంతో జరగబోయే చర్చల్లో ఈ ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. లడఖ్ ప్రతినిధులను అక్టోబరు 6న సమావేశానికి ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్రం ఏర్పాటుకు ప్రజల డిమాండ్‌పై చర్చలను పునఃప్రారంభించనుంది. గత రెండు వారాల నుంచి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ రాష్ట్రహోదాతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ ఆమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
గత మూడేళ్ల నుంచి కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి.. రాష్ట్రహోదా కల్పించాలని కోరుతున్నారు. తమ భూభాగం, సంస్కృతి, వనరులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దుచేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వాంగ్‌చుక్ సహా లేహ్‌లో చాలా మంది స్వాగతించారు. కానీ ఏడాదిలోపే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో రాజకీయ శూన్యత ఏర్పడిందని పేర్కొంటూ ఆందోళనలు మొదలయ్యాయి.
భాగస్వామ్యమయ్యాయి. లేహ్‌లోని మెజార్టీలైన బౌద్ధులు, కార్గిల్‌లో మెజార్టీ వర్గాలైన ముస్లింలు చేతులు కలిపి లేహ్ కార్గిల్ డెమొక్రాటిక్ అలయెన్స్ పేరుతో సంయుక్త వేదికను ఏర్పాటుచేసుకున్నాయి. దీంతో లడఖ్ వాసుల డిమాండ్‌పై అధ్యయనానికి కేంద్రం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. లడఖ ప్రతినిధులు ఈ ఏడాది మార్చిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. కానీ, చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి. తమ డిమాండ్లను అమిత్ షా తిరస్కరించినట్టు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa