ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై కానిస్టేబుల్, హోంగార్డు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ వివాహిత పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హోంగార్డు ఆమెకు ఫోన్ చేసి మానసికంగా వేధించాడు. దీంతో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్‌ను సాయం అడగ్గా అతడు ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa