భారత వైమానిక దళంలో దశాబ్దాలుగా సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాల శకం శుక్రవారంతో ముగియనుంది. వాటి స్థానంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ జెట్లు రానున్నాయి. రూ.62వేల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదరనుంది. తేజస్ రాకతో వైమానిక దళ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa