వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈసారి గట్టిగా బదులిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాధవరావు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.... ఎమ్మెల్యే బాలకృష్ణకి తన భాగస్వామ్యపక్ష నాయకుడి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి. ఓజీ సినిమాకి సీఎం చంద్రబాబు రూ.1000 లకు టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చాడనే కడుపు మంట ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాన్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. నీ పేరు 9వ నెంబర్‌లో రాస్తే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ని అడగాలి. అంతేకాని సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడటం సిగ్గుచేటు. ఇది సభా మర్యాదలను అగౌరవపర్చడమే. బాలకృష్ణతో సహా ఇకపై ఎవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ మాజీ సీఎం వైయస్ జగన్‌ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడితే దానికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నాం. మీరెలా మాట్లాడతారో మేం కూడా అలాగే మాట్లాడతాం. మీరు గౌరవం ఇస్తే.. మేం కూడా గౌరవం ఇస్తాం. ఇంకోసారి వైయస్ జగన్ గురించి ఇలా వాగితే దానికి సమాధానం మరోలా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు సందర్భంగా తనకు సహకరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరీశ్వరి దంపతులను కూడా చంద్రబాబు వాడుకుని వదిలేశాడు. ఆ దంపతులిద్దరికీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా పురంధరీశ్వరికి దివంగత వైయస్ఆర్ కేంద్ర మంత్రి పదవి ఇప్పించిన విషయాన్ని బాలకృష్ణ మరిచిపోకూడదు. వైయస్ఆర్ లేకపోయుంటే పురంధరీశ్వరి రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. వైయస్ఆర్ ఆదుకోకపోయుంటే బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడా? కనీసం జైలుకు పోకుండా సినిమాలు చేసుకునే అవకాశం ఉండేదా అని ఆలోచించుకోవాలి. బాలకృష్ణ ఇంకోసారి నోరుజారి మాట్లాడితే వైయస్ఆర్‌సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అదేభాషలో ఆయనకు సమాధానం చెబుతారని హెచ్చరిస్తున్నానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa