తాడేపల్లి మండలంలోని ఉండవల్లి సెంటర్ వంశీ స్కూల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలి మెరుపులు వచ్చి కేబుల్ వైర్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కేబుల్ వైర్లను స్తంభానికి కట్టడానికి ఉపయోగించిన ఇనుప తీగల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa