అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో గ్రాండ్ బ్లాంక్‌లోని మోర్మాన్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. కారుతో చర్చిని ఢీకొట్టి, కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నిప్పుపెట్టాడు. నిందితుడు థామస్ జాకబ్ స్యాన్‌ఫోర్డ్ (40)ను పోలీసులు హతమార్చారు. ఈ ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులు వెంటనే ఆగాలని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa