ఆసియా కప్ ఫైనల్ టీమిండియా అదరగొట్టింది.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి తొమ్మిదో సారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో పాక్‌పై గెలుపులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆసియా కప్ గెలుపుతో యావత్ భారతం సంబరాల్లో మునిగి తేలింది. ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ ను క్రికెటర్లతో పాటుగా వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించారు.. ట్వీట్‌లు చేశారు. అయితే పాక్‌పై ఫైనల్‌లో గెలుపు తర్వాత తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేష్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.
పాక్ మంత్రి చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తిరస్కరించిన భారత్.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితుడి తండ్రి కీలక వ్యాఖ్యలు
ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాక టీమిండియా కుర్రాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. అక్కడికి రాగానే తిలక్ వర్మ భారత టీమ్ ధరించే క్యాప్ తీసుకుని.. డియర్ లోకేష్ అన్న.. లాట్స్ ఆఫ్ లవ్.. ఇది నీ కోసమే అంటూ' క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. క్యాప్ మీద రాస్తూ వీడియో కూడా తీయించాడు. ఈ వీడియోను మంత్రి లోకేష్ ట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది. 'తమ్ముడూ, ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.. నువ్వు ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు.. నీ నుండి నేరుగా ఈ మాట వినడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా, ఛాంప్!' అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది మార్చి నెలలో దుబాయ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్ వెళ్లారు. ఆ సమయంలో మంత్రి లోకేష్ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, అలాగే యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో ఫోటో దిగారు.. ఆ ఫోటోను ట్వీట్ చేస్తూ ఆనాటి సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకున్నారు లోకేష్. 'ఆ రోజు నేను సిరీస్ సుల్తాన్ అభిషేక్ శర్మతో కలిసి ఉన్నాను. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అతను చివరి వరకు ఆడి, మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మొత్త మీద ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపు ప్రతి భారతీయుడికి ఒక కిక్ ఇచ్చింది.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా టీమిండియా గెలుపు, తిలక్ వర్మ ఇన్సింగ్స్‌పై ట్వీట్ చేశారు. 'తిలక్ వర్మ అద్భుతమైన ఆటగాడు. మన తెలుగు కుర్రాడు అయిన తిలక్ వర్మ, పిచ్‌పై తన ఆధిపత్యాన్ని చూపించాడు. మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడి, ఇండియాకు విజయం అందించాడు. ఒత్తిడి ఉన్నా కూడా, అతను చాలా ప్రశాంతంగా, తెలివిగా ఆడాడు. అతని ఆట అందరికీ స్ఫూర్తినిస్తుంది. తెలుగు కుర్రాళ్లలో ఉండే పట్టుదల, ధైర్యం ఇది. తిలక్, నీవు చాలా బాగా ఆడావు. నిన్ను చూసి మేము చాలా గర్విస్తున్నాము' అంటూ ప్రశంసించారు.
'భారత జట్టుకు అభినందనలు.. ఆసియా కప్ 2025 విజేతలుగా నిలిచింది. పెద్ద వేదికపై టీమ్ ఇండియా మరోసారి అద్భుతమైన ఆటతీరును చూపించింది. ఫైనల్‌లో చాలా బాగా ఆడి, తొమ్మిదోసారి Asia Cup టైటిల్‌ను గెలుచుకుంది. ఈ గొప్ప విజయం జట్టులోని అందరి కృషిని చూపిస్తుంది. వారి సమష్టి కృషి, పట్టుదల దీనికి కారణం. ఇది ప్రతి భారతీయుడికి దసరా పండుగకు ముందు వచ్చిన మంచి బహుమతి. ఈ గెలుపు అందరి మనసులను గర్వంతో, సంతోషంతో నింపింది' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa