తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) – కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు అనూహ్య స్పందన లభించింది.తెలంగాణ సంస్కృతి పరంపరల్ని వెలుగులోకి తెచ్చేలా, ఈ ఉత్సవాన్ని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటలతో ఆస్వాదించాయి. పూలతో అలంకరించిన బతుకమ్మలతో వేదిక మొత్తం శోభాయమానంగా మారింది. కెనడాలోనే పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రత్యేకతను తెలియజేయడానికి ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని టీడీఎఫ్ ప్రతినిధులు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని టీడీఎఫ్ కెనడా నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా రూపొందించారు. తెలంగాణ స్పూర్తిని ప్రతిబింబించేలా వేదిక అలంకరణ, సాంప్రదాయ Telangana వంటకాలతో భోజన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా టీడీఎఫ్ కెనడా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో "గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారం"ను మహేష్ మాదాడి, రజిని దంపతులకు అందజేశారు. గత 21 ఏళ్లుగా కెనడాలో బతుకమ్మ పండుగ నిర్వహణకు తమదైన సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి టీడీఎఫ్ కెనడా తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa