భారతీయ వ్యాపార రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మూడో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్-2025 జాబితాలో ఈ ఘనత సాధించడం ద్వారా, టాప్-3లోకి అడుగుపెట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. దేశంలో అత్యంత సంపన్న మహిళగా కూడా ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.బుధవారం విడుదలైన ఈ జాబితా ప్రకారం, రోష్ని నాడార్, ఆమె కుటుంబం సంపద విలువ రూ. 2.84 లక్షల కోట్లుగా ఉంది. కేవలం 44 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన ఆమె, టాప్-10లో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలిగానూ నిలిచారు. వ్యాపార దక్షతతో హెచ్‌సీఎల్ సంస్థను అంతర్జాతీయంగా విస్తరింపజేయడమే కాకుండా, శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa