విజయవాడ ఉత్సవ్-2025 అరుదైన ఘనత సాధించింది. ఉత్సవ్‌లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన కార్నివాల్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు సర్టిఫికెట్ అందుకున్నారు. కార్నివాల్‌లో చేపట్టిన భారీ డప్పు ర్యాలీ ఈ రికార్డు సృష్టించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత ఆయన విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివాల్‌ను ప్రారంభించారు. అనంతరం అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కార్యక్రమంలో గంటకు పైగా కూర్చుని 40 కళా బృందాల ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డు సాధించినందుకు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ కార్నివాల్‌లో 3 వేల మంది కళాకారులతో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు కళాకారులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ఊరేగింపు రథం నిలిచింది. ఈ కార్నివాల్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa