భారత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, వ్యాపార అనుకూల వైఖరిపై ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఏఎస్ఎంఎల్ ప్రశంసల వర్షం కురిపించింది. పెట్టుబడుల విషయంలో ప్రధాని మోదీ చాలా చొరవ తీసుకుంటారని, కంపెనీల అభిప్రాయాలకు ఎంతో విలువ ఇస్తారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్ హీమ్స్‌కెర్క్ కొనియాడారు.బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ సీఈవో క్రిస్టోఫ్ ఫౌకేతో ప్రధాని మోదీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఆ సమావేశంలో మోదీ కేవలం తాము చెప్పింది వినడమే కాకుండా, "మీరు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. మేం ఇంకా మెరుగ్గా ఏం చేయాలో సూటిగా చెప్పండి" అని అడిగారని హీమ్స్‌కెర్క్ వెల్లడించారు. మోదీ నిక్కచ్చి వైఖరి తమను ఆకట్టుకుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa