తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ వచ్చిన ఈ-మెయిల్స్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి బస్టాండ్, ఆలయాలు, జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం, అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa