ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 11:56 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాల్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు, ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa