ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య రాత్రి వేళ పాము (నాగిని) రూపంలోకి మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాడు. మహమూదాబాద్ తహసీల్‌లోని లోధసా గ్రామానికి చెందిన మీరజ్ అక్టోబర్ 4న 'సమాధాన్ దివస్' (ప్రజా సమస్యల పరిష్కార దినం) సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ఆనంద్‌కు ఈ మేరకు ఫిర్యాదు అందించారు. తన భార్య నసీమున్ రాత్రిపూట పాములా మారి బుసలు కొడుతూ, కాటేస్తానంటూ తనను భయభ్రాంతులకు గురిచేస్తోందని మీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa