ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన దాదాపు ఏడాది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది. ఢిల్లీలోని అత్యంత ప్రముఖమైన లోధీ ఎస్టేట్‌లో ఆయనకు టైప్-VII బంగ్లాను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తనకు నివాసం కేటాయించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్‌కు 95, లోధీ ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించారు. ఆయన ఈ కొత్త ఇంటిని సందర్శించి పరిశీలించారు. సుమారు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ టైప్-VII బంగ్లాలో నాలుగు బెడ్‌రూమ్‌లు, విశాలమైన లాన్‌లు, గ్యారేజ్, ఆఫీసు స్థలంతో పాటు మూడు సర్వెంట్ క్వార్టర్లు ఉంటాయి. దీంతో కేజ్రీవాల్ అధికారిక నివాస సమస్యకు ఒక ముగింపు లభించినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa