ఢిల్లీలో దినేష్ అనే వ్యక్తిపై అతని భార్య దారుణంగా దాడి చేసింది. అక్టోబర్ 3న తెల్లవారుజామున 3 గంటల సమయంలో, నిద్రిస్తున్న దినేష్‌పై మరిగే నూనె, కారం పొడి చల్లింది. తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ఆస్పత్రిలో చేర్చగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దినేష్ ఫిర్యాదు మేరకు, అతని భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa