తనపై దాడి యత్నం ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.కోర్టు ధర్మాసనంలో కేసు విచారణ కొనసాగుతుండగా చోటు చేసుకున్న ఈ ఘటనపై, నేడు సీజేఐ గవాయ్ స్పందిస్తూ, “ఆ ఘటన సమయంలో నేను, నా సహచర న్యాయమూర్తి షాక్‌కు గురయ్యాం,” అని తెలిపారు. అయితే, “అది మా కోణంలో ఇప్పటికే ముగిసిన అధ్యాయం,” అని వ్యాఖ్యానించారు.అయితే ఈ ఘటనను హాస్యంగా తీసుకోవడం తగదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. “ఈ దాడి యత్నం స్వయంగా సుప్రీంకోర్టుపై అవమానానికి సమానం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని ఆయన అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, “ఇలాంటి ఘటనలు క్షమించరానివి. కానీ, దీనిని 'ముగిసిన అధ్యాయం'గా పేర్కొన్న సీజేఐ ఆత్మస్థైర్యం ప్రశంసనీయం,” అని పేర్కొన్నారు.ఇక అక్టోబర్ 6న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో — సుప్రీంకోర్టు కోర్టు నెం.1లో సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం పిటిషన్లను విచారిస్తుండగా, 71 ఏళ్ల న్యాయవాది రాకేశ్ కిశోర్ హఠాత్తుగా వేదికవైపు వచ్చారు. వెంటనే తన కాలికి ఉన్న బూటును విసరబోయే ప్రయత్నం చేయగా, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. ‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే చూస్తూ ఉండబోము’ అంటూ నినాదాలు చేసినట్లు తెలిసింది.అయితే, ఈ దాడి యత్నం తనను భయపెట్టలేదని, తన పని తీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని సీజేఐ గవాయ్ న్యాయవాదులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. “ఇలాంటి బెదిరింపులు నా దృష్టిని మళ్లించలేవు,” అని ఆయన తేల్చిచెప్పారు.స్ గవాయ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa