ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకి ఒక చెంచా మునగాకు పొడి: ఆయుష్షు పెరిగే మార్గం!

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 09:18 PM

మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఆకుగా మునగాకు పేరు పొందింది. నిజానికి మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమే. అయితే, ముఖ్యంగా ఆకులను ఎండబెట్టి పొడి రూపంలో తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు, విటమిన్ A, C, E వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సమస్యలు, ఇమ్యూనిటీ లోపాలు, శిశువు పెరుగుదల లోపాలు వంటి అనేక సమస్యలకు పరిష్కారాన్ని అందించగలవు.మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల నుంచి, రక్తపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూడా మునగాకుపొడిని ఔషధంగా వాడుతున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.ఫ్రీ రాడికల్స్‌ను కణాల నుంచి తొలగించడంలో మునగాకు కీలకంగా పనిచేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, లివర్ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.డయాబెటిస్ బాధితులకు మునగాకుతో ఉపశమన.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డయాబెటిస్ సమస్యకు సహాయంగా మునగపొడి పనిచేస్తోంది. మానవులపై జరిగిన పలు అధ్యయనాల ప్రకారం, మునగపొడి తీసుకున్నవారిలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు తేలింది. ఇందులో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఎలా తీసుకుంటే మునగాకు లాభాలు రెట్టింపు అవుతాయంటే?హెల్త్ ఎక్స్‌పర్ట్ మంజూ మాలిక్ ప్రకారం, మునగాకు పొడిని కొన్ని ప్రత్యేక పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు మరింత ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉన్న పదార్థాలు — నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ, కివీ లాంటి పండ్లతో కలిపి మునగాకు పొడిని తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయి.ఉదాహరణకు, మునగాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే ఉసిరికాయ రసం కలిపినా అదే విధంగా ఉపయోగం కలుగుతుంది.
విశేష సూచన:హార్ట్ పేషెంట్లు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మునగాకు పొడి తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే, కొన్ని పదార్థాలతో కలిపితే తగిన ఫలితాలు రాకపోవచ్చు, కాబట్టి నిర్దిష్టంగా ఏ పదార్థాలు కలపాలో, ఏవాటిని మానుకోవాలో తెలుసుకుని తినడం ఉత్తమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa