ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలిథిన్‌ వాడకంపై జరిమానా.. అమ్మితే రూ.1000.. వాడితే రూ.100

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 02:27 PM

పర్యావరణానికే కాక మనుషలకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం కలిగించేది ఏదైనా ఉందా అంటే.. అదే ప్లాస్టిక్. మనిషి జీవితంలో ఇది భాగమయిపోయింది. నేడు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా పాలిథిన్ సంచులు దర్శనం ఇస్తున్నాయి. ఇది భూమిలో కరగదు.. అలానే మిగిలిపోతుంది. ఇక పట్టణాల్లో అయితే పశువులు.. ప్లాస్టిక్ తిని తీవ్ర అనారోగ్యం పాలై.. నరకయాతన అనుభవిస్తాయి. ప్లాస్టిక్ వినియోగం మీద ప్రభుత్వాలు నిషేధం విధించినా సరే.. వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు పాలిథిన్ వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..


35 ఏళ్ల మహిళను పెళ్లాడి తెల్లారేసరికే చనిపోయిన 75 ఏళ్ల వృద్ధుడి కథలో షాకింగ్ ట్విస్ట్.. అతడెలా మరణించాడంటే?


తాజాగా రఘురామకృష్ణరాజు .. ఆకివీడులో స్థానిక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిథిన్ సంచులు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాక ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అలాంటి పాలిథిన్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. అలా కాకుండా ఎవరైనా పాలిథిన్ సంచులు అమ్మినా.. వాడినా.. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


పాలిథిన్ వినియోగాన్ని అరికట్టడం కోసం భారీ ఎత్తున జరిమానాలు విధించాలని సూచించారు. ఆదివారం నుంచి ఆకివీడులో కఠిన నియమాలు అమలు చేయాలని తెలిపారు. దీనిలో భాగంగా ఎవరైనా దుకాణం నిర్వహకుడి వద్ద ప్లాస్టిక్‌ సంచులు నిల్వ ఉన్నా.. అమ్మినా సదరు షాపు యజమానికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని సూచించారు. ఎవరైనా పండ్లు, కూరగాయలు, మాంసం, సరుకులు, ఆహార పదార్థాలు, తదితర వస్తువులను పాలిథిన్ సంచుల్లో తీసుకెళ్తే.. వారికి రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.


ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం మళ్లింపు రహదారిని.. పూర్తిస్థాయిలో వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణల తొలగింపు అంశంలో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. ప్రజలు, షాపుల నిర్వాహకులు.. తమ దుకాణాలు, నివాసాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి.. వాటిని పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. ప్రజలు, ప్రభుత్వం సమిష్టి క‌ృషితో ఆదర్శవంతమైన ఆకివీడుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు.


ఉండి నియోజకవర్గంలో ఉన్న పంట కాల్వల్లో ఎవరైనా ప్లాస్టిక్ వ్యర్థాలు వేసినా.. ఇతర చెత్త వేసినా.. వారికి రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. ఇలా వచ్చిన మొత్తాన్ని కాలువ అభివృద్ధి నిధికి జమ చేస్తామని.. ఆమొత్తాన్ని పంట కాలువలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa