మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్ఆర్ పేట పీఎస్లో వివాదం సృష్టించారని నానిసహా 29 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు. అయితే ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందించారు. తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని.. మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించానని, ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేర్ని నానిపై కేసు నమోదు చేయించిందని వైయస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa