ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి ఇవాళ(సోమవారం) బయలు దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45లకి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే, నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించనున్నారు. రేపు(మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa