భారత ఆటోమొబైల్ రంగంలో వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కార్లను విక్రయించి సంచలనం రేపింది. ఒకే ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లోనే ఈ ఘనత సాధించిన తొలి కార్ల బ్రాండ్‌గా నిలిచినట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ నెలలో విన్‌ఫాస్ట్ 13,914 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 1,03,884కు చేరింది. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. గత 11 నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల బ్రాండ్‌గా విన్‌ఫాస్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa