ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ గుమ్మడికాయ.. బరువు అక్షరాలా 1,064 కిలోలు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:32 AM

అమెరికాలోని సాంట రోసాకు చెందిన ఇంజినీర్ బ్రాండన్ డ్వాసన్ భారీ గుమ్మడికాయను పండించారు. ఆ గుమ్మడికాయ బరువు అక్షరాలా 1,064 కిలోలు. దీన్ని కాలిఫోర్నియాలో జరిగిన పోటీల్లో ప్రదర్శించి డ్వాసన్ విజేతగా నిలిచారు. గత ఏడాది 3 కిలోలు తక్కువ బరువుతో గెలుపు రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారట. ఈ సారి గెలవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా భారీ గుమ్మడికాయలు పండిస్తున్న డ్వాసన్, ఈ విజయంలో భాగంగా 20 వేల డాలర్లు బహుమతిగా పొందారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa