రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్, చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, నూతన లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతి చికెన్ షాపునకు లైసెన్స్ ఇవ్వడంతో పాటు, ఏ ఫారం నుంచి కోళ్లు వచ్చాయి, ఎవరికి విక్రయించారు అనే వివరాలను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలను బయటకు తీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాశ్ నాయుడు అధ్యక్షత వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa