రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అన్షుల్ సాహు పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో సమకూరిన డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా అన్షుల్ సాహు తీసుకొని పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే, ప్రైవేట్ సంస్థ అధికారులు షాక్ అయ్యారు. సంస్థ మేనేజర్ నవాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న అన్షుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa