ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిన్సుకియా జిల్లాలోని కాకోపథర్లోని భారత ఆర్మీ శిబిరంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. దాడిలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం-ఇండిపెండెంట్ (ULFA-I) హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భద్రతా సిబ్బంది గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించి, పరిసర ప్రాంతాన్ని మూసివేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa