పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో జరిగిన ఓ కాటికాపరి హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నర్సరావుపేట-రావిపాడు మార్గంలోని స్వర్గపురి-2 శ్మశానవాటికలో క్రిస్టియన్ పాలెంలో నివసించే ఎఫ్రాన్ అనే వ్యక్తి కాటికాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి శ్మశానంలోనే నిద్రిస్తున్న సమయంలో, గుర్తుతెలియని దుండగులు అతనిపై గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. మెడ, గొంతు భాగాలపై విచక్షణారహితంగా నరకడంతో ఎఫ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హత్య పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఎఫ్రాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్ పాలెంలో నివసించే ఎఫ్రాన్, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేశాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa